Saturday, October 8, 2016

కాశ్మీర్ పై బాలగోపాల్

కశ్మీర్ అనగానే  ఈ రోజు మతోన్మాదం , హింస స్ఫురించే వాతావరణం నెలకొనింది గానీ సగటు కశ్మీరీలో ఇవేవీ కనిపించవు. 'మేము వేరు, మా బతుకు వేరు . మా పాటికి మమ్మిల్ని ఉండనివ్వండి అంటే మీకెందుకు అర్ధం కాదు? అని స్నేహంగానే విస్మయం వ్యక్తం చేస్తారు. వాళ్ళ భావాలతో నిమిత్తం లేని వేరే ఏవేవో విషయాలకు కశ్మీర్ ప్రతీక అయిపోవడం వల్ల ఈ ప్రశ్న ఎవరికీ వినిపించదు. నెహ్రూ భ్రాండు లౌకికవాదులకు  కాశ్మీర్ ఆధునిక భారత లౌకికతకు ప్రతీక. అద్వానీ భ్రాండు దేశభక్తులకు కశ్మీర్  అఖండ భారత్ కు ప్రతీక. పాకిస్థానీ పాలకులకు అనంతమైన జిహాద్ కు ప్రతీక. కశ్మీర్  గురుంచి ఆలోచించడమంటే కశ్మీరీల కోసం ఆలోచించడమని మనమెప్పుడు  అర్థం చేసుకుంటాం?
                                                                      - బాలగోపాల్    
  బుర్హాన్ వాణి  కాల్చివేత తర్వాత కశ్మీర్ లోయ మరోసారి భగ్గుమనడం చూశాం . యువకుల నుండి పెద్దఎత్తున రాళ్ల దాడులు, సైన్యం నుండి పెద్దఎత్తున పెల్లెట్ల ప్రయోగమూ, కాల్పులూ జరిగి ఈ మూడు నెలలలో ఇప్పటికే 88 మంది దాకా కశ్మీరీలు చనిపోయారు. 1989 నుండి కశ్మీర్ చరిత్రంతా ఒక సంఘర్షణ నుండి మరో సంఘర్షణకు ప్రయాణమే. ఒక రక్తపాతం నుండి మరో రక్తపాతానికి ప్రయాణమే. ఇది ఈ  రోజూకి తాజాది. మరోటి జరగదన్న నమ్మకం లేదు.





ప్రతులకు, వివరాలకు : హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ,

ప్లాట్ నెం.85. బాలాజీ నగర్,

గుడిమల్కాపూర్, హైదరాబాద్- 500006

ఫొన్ నెం:23521849

పేజీలు; 140, వేల ,120/-

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌