Wednesday, March 18, 2015

అంగన్‌వాడీ కార్యక్రమంపై అరుదైన పుస్తకం : ''ఉడకని మెతుకు'' - రచన: కె.ఆర్‌.వేణుగోపాల్‌, అనువాదం: రివేరా

ఉడకని మెతుకు
సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసిడిఎస్‌)
(ఒక మునక - ఒక ముందంజ)


భారత ప్రభుత్వం 1975 నుంచి దేశవ్యాప్తంగా నిరుపేద కుటుంబాలకు చెందిన ఆరేళ్ల లోపు చిన్నారులకు ఆరోగ్యం, పోషకాహారం, ప్రాథమిక పూర్వ విద్య తదితర అవసరాలను తీర్చేందుకు అమలు పరుస్తున్న కార్యక్రమం 'ఐ.సి.డి.ఎస్‌.' (ది ఇంటిగ్రేటెడ్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ సర్వీసెస్‌). సమగ్ర శిశు అభివృద్ధి పథకం అంటే చాలామందికి తెలియకపోవచ్చు కానీ ''అంగన్‌వాడీ కార్యక్రమం'' అంటే అందరికీ అర్థమవుతుంది. తీవ్ర శ్రమ దోపిడీకి గురవుతున్న అంగన్‌ వాడీ కార్యకర్తల ఇటీవలి ఆందోళనల వల్ల ఈ  పథకం గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పథకం అమలు తీరుతెన్నులను, లోటుపాట్లను కె.ఆర్‌.వేణుగోపాల్‌ నిశితంగా పరిశీలించి 'ది ఇంటిగ్రేటెడ్‌ ఛైల్డ్‌ డెవలప్‌మెంట్‌ సర్వీసెస్‌: ఫ్లాగ్‌షిప్‌ ఎడ్రిప్ట్‌ అనే పుస్తకాన్ని వెలువరించారు. దాని తెలుగు అనువాదమే ఈ 'ఉడకని మెతుకు'.
...

'' పేదల జీవితాలతో లోతుగా ముడిపడిపోయిన ఒక పథకం ఏవిధంగా నిర్వీర్యం అవుతున్నదనేది చెప్పేందుకే రచయిత ఈ పుస్తకం రచించారు. ఇలాంటి పరిస్థితులను చూసి ఆగ్రహించకుండా ఉండలేం. ఈ నేపథ్యంలోనే దీనికి కారణమైన వారిని రచయిత ప్రశ్నించారు. వారిని బాధ్యులను చేశారు . దాని ఫలితాలు కనిపంచడం కూడా మొదలయింది. ఐసీడీఎస్‌ కార్యక్రమం అమలును సామాజిక తనిఖీకి గురి చేసినప్పుడు వెలికి వచ్చిన అవకతవకలు కల్గించే ఆగ్రహం నుంచి ఈ పథకాన్ని రచయిత 'ఒక ముందంజ .. ఒక మునక' అని అభివర్ణించారు.''
- ద హిందూ, 27 ఏప్రిల్‌ 2012

''ఐసీడీఎస్‌ కార్యక్రమం ఒకటే కాదు, మొత్తంగా దేశంలోని మానవ వనరుల పరిస్థితిని చూసి ఆందోళన చెందే ప్రతి ఒక్కరూ చదవవలసిన పుస్తకం.''
- ఫ్రంట్‌లైన్‌, 21 ఏప్రిల్‌- 4 మే, 2012



ఉడకని మెతుకు
సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసిడిఎస్‌)
(ఒక మునక - ఒక ముందంజ)


రచన: కె.ఆర్‌.వేణుగోపాల్‌

ఆంగ్ల మూలం:  The Integrated Child Development Services: Flagship Adrift, First pubglished in English by Konark Publishers Pvt.Ltd., New Delhi in association with the Council for Social Development, New Delhi, 2012

తెలుగు అనువాదం: రివేరా

154 పేజీలు, వెల రూ. 80/-

ఐఎస్‌బిఎన్‌ : 978-81-907377-6-0




Monday, March 9, 2015

'ఇంట్లో ప్రేమ్‌చంద్‌' అనువాదానికి గాను శ్రీమతి ఆర్‌.శాంతసుందరికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాదక పురస్కారం

'ఇంట్లో ప్రేమ్‌చంద్‌' అనువాదానికి గాను శ్రీమతి ఆర్‌.శాంతసుందరికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాదక పురస్కారం

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురించిన ''ఇంట్లో ప్రేమ్‌చంద్‌'' పుస్తక అనువాదానికి గాను  కేంద్ర సాహిత్య అకాడమీ వారు శ్రీమతి ఆర్‌. శాంతసుందరికి ఈ యేడు అనువాదక అవార్డును ప్రదానం చేయబోతున్నారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం.

గత 40 సంవత్సరాలుగా అనువాద ప్రక్రియలో కృషి చేస్తున్న శ్రీమతి ఆర్‌. శాంతసుందరి ఇప్పటివరకు కథ, నవల, కవిత్వం, నాటకం, వ్యక్తిత్వ వికాసం మొదలైన అన్ని ప్రక్రియలలో మొత్తం 68 పుస్తకాలకు అనువాదం చేశారు. 


ఇంగ్లీషు హిందీ భాషల నుంచి తెలుగులోకే కాకుండా అనేక పుస్తకాలను హిందీలోకి అనువదించి తెలుగు సాహిత్యానికి జాతీయ స్థాయి ప్రాచుర్యాన్ని కల్పించారు. అలాంటి అనువాదాల్లో సలీం నవల 'కాలుతున్న పూలతోట', పెద్దింటి అశోక్‌ కుమార్‌ కథలు, ఓల్గా కథలు, డా. కె.శివారెడ్డి 'అంతర్జనం', డా.ఎన్‌.గోపి 'కాలాన్ని నిద్రపోనివ్వను', వరవరావు ఎంపిక చేసిన 51 కవితలు మొదలైనవి వున్నాయి.

ప్రఖ్యాత రచయిత శ్రీ కొడవటిగంటి కుటుంబరావు కుమార్తె అయిన శ్రీమతి ఆర్‌. శాంతసుందరి 1947లో మద్రాసులో జన్మించారు. బిఎ ప్రెసిడెన్సీ కాలేజీలో, ఎంఎ, బిఎడ్‌ దిల్లీ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేసారు. వీరి సోదరుడు శ్రీ కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ రచించిన పలు పుస్తకాలను హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురించిన విషయం విదితమే. 


కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారానికి ఎంపికైన ''ఇంట్లో ప్రేమ్‌ చంద్‌'' పుస్తకాన్ని హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ 2012 సెప్టెంబర్‌లో ప్రచురించింది. అంతకంటే ముందు జనవరి 2009 నుండి జూలై 2012 వరకు భూమిక మాస పత్రికలో సీరియల్ గా వెలువడింది.  ప్రేమ్‌చంద్‌ రచనల గొప్పదనాన్ని ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఆ మహారచయిత వ్యక్తిత్వం, మానవీయత, విశాల హృదయం గురించి మనకు తెలియని అనేక విషయాలను స్వయంగా ఆయన సతీమణి శివరాణీదేవి ఇందులో అద్భుతంగా ఆవిష్కరించారు. శ్రీమతి ఆర్‌.శాంతసుందరి ఈ పుస్తకాన్ని హిందీ నుంచి సరళమైన తెలుగులోకి అనువదించి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికయ్యారు .

శ్రీమతి ఆర్‌. శాంతసుందరి గతంలో భారతీయ అనువాద్‌ పరిషద్‌, దిల్లీ వారి 'డా.గార్గీ గుప్త్‌ ద్విగాగీష్‌ పురస్కార్‌; నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ దిల్లీ వారి అనువాద పురస్కారం; హైదరాబాద్‌ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారి అనువాద పురస్కారం అందుకున్నారు.

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురించిన పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాదక బహుమతి  లభించడం ఇది రెండో సారి. గతంలో హెచ్‌బిటి ప్రచురించిన డా.యాగాటి చిన్నారావు రచన దళిత్‌ స్ట్రగుల్‌ ఫర్‌ ఐడెంటిటీ (ఆంధ్రప్రదేశ్‌ దళిత ఉద్యమ చరిత్ర) అనువాదానికి గాను ప్రభాకర్‌ మందారకు ఈ అవార్డు లభించింది.

ఈసందర్భంగా శ్రీమతి ఆర్‌. శాంతసుందరికి హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ శుభాభినందనలు తెలియజేస్తోంది. 




Sunday, March 1, 2015

గ్రామీణ జీవన సౌందర్యం - వేణు (ఈనాడు)

గ్రామీణ జీవన సౌందర్యం 

శివరాం కారంత్ నవల "మరల సేద్యానికి" పై ఈనాడులో వేణు గారు  చేసిన సమీక్ష :
(ఈనాడు ఆదివారం 01 మార్చ్ 2015 సౌజన్యంతో )


మరల సేద్యానికి'
శివరామ కారంత్‌ నవల,
తెలుగు అనువాదం: తిరుమల రామచంద్ర
336 పేజీలు, ధర రూ.150/-

ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 006
ఫోన్‌ : 040 23521849
Email: hyderabadbooktrust@gmail.com 
 

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌