మతతత్వంపై బాలగోపాల్
''హైందవం గర్వంగా ప్రకటించుకునే విప్లవ సంప్రదాయమేమీ లేదు. అందువల్ల ''హిదూత్వం' పరమత ద్వేషం మీద మాత్రమే మనగలదు'' - బాలగోపాల్
భారత దేశంలో మతతత్వం అనే అంశంపై ప్రముఖ న్యాయవాది, మానవ హక్కుల వేదిక నాయకుడు, రచయిత కె. బాలగోపాల్ (1952-2009) వివిధ సందర్భాలలో రాసిన 31 వ్యాసాల సంకలనమే ఈ పుస్తకం.
మతతత్వంపై, ప్రత్యేకించి హిందూత్వపై డా.కె.బాలగోపాల్ రాసిన 31 వ్యాసాల సంకలనమిది. మన జీవితాలపై హిందూత్వ ప్రభావం తాలూకు విభిన్న అంశాలను తడిమే ఈ వ్యాసాలు మూడు భాగాలలో పొందుపరచబడ్డాయి.
మొదటి భాగం 'హిందూ ధర్మ ప్రజాస్వామ్యం'లో దేశభక్తి, హిందూమతం, దాని వర్ణవ్యవస్థ, అదేవిధంగా ప్రజాస్వామ్యం నుంచి మతాన్ని (వర్ణ వ్యవస్థను) వేరు చేయాల్సిన అవసరం వంటి అంశాలపై రాసిన వ్యాసాలున్నాయి.
రెండో భాగం ''హిందూత్వ విద్య''లో డా.బాలగోపాల్ విద్యారంగ కాషాయీకరణ గురించి చర్చించారు. వీటిలో భారతదేశానికీ, దాని విజేతలకూ సంబంధించిన చారిత్రక వాస్తవాలు ఏమాత్రం వక్రీకరించకుండా విద్యార్థులకు ''లౌకికతత్వం'' విలువను బోధించాల్సిన ఆవశ్యకతను విశ్లేషించారు.
మూడో విభాగం ''మైనారిటీలు-సంఘ్‌పరివార్''లో ముస్లింలూ, క్రైస్తవులూ తదితర అ ల్పసంఖ్యాకులపై జరిగే దాడులకూ, అణచివేతకూ హిందూత్వ ఎలా దోహదం చేస్తోందో వివరించారు. బాబ్రీ మసీదు కూల్చివేత, గుజరాత్ మారణకాండ, క్రైస్తవులపై పెరుగుతున్న దాడుల గురించి ఈ భాగంలో చర్చించారు.
దేశంలో చోటు చేసుకున్న ఆయా చారిత్రక సంఘటనలను ఒక క్రమపద్ధతిలో అర్థం చేసుకునేందుకు వీలుగా ఈ మూడు భాగాలలోని వ్యాసాలన్నీ తేదీల వరుసక్రమంలో పొందుపరచబడ్డాయి.
ఈ పుస్తకానికి బిజు మాథ్యూ ముందుమాట రాశారు.
ఇందులోని వ్యాసాల వివరాలు:
హిందూ ధర్మ ప్రజాస్వామ్యం:
1. దేశభక్తి
2. శ్రామికుడిని శ్రమ దోపిడీకి లోనయ్యేలా చూడటం 'మతం' కర్తవ్యం.
3. హిందూ మత రాజ్యం
4. బ్రాహ్మణ ధర్మంలో ప్రజాస్వామ్యం
5. పర్సనల్ చట్టాలు: ఏకీకరణ కాదు, ప్రజాస్వామీకరణ జరగాలి.
6. ప్రాచీన భారత రాజకీయార్థిక నిర్మాణాలను ప్రతిబింమించే రచనలు-మహిళల జీవితం.
హిందూత్వ విద్య:
7. చదువును గురించి మాట్లాడటమూ కుట్ర అవుతుందా?
8. చరిత్ర పాఠాలపై కాషాయం నీడ
9. విద్య-భావజాలం
10. లౌకిక ప్రజాస్వామిక విలువలు
11. పాఠాంశాలలో హిందూత్వవాదుల జోక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
12. విద్య, విజ్ఞానం: హిందూత్వవాదుల దాడిని ఎదుర్కోవడానికి మనం సిద్ధమేనా?
మైనారిటీలు-సంఘ్ పరివార్:
13. నిరాధారమైన రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంపై జరుగుతున్న మత ఘర్షణలను ఆపండి! దేశ రాజకీయాల్లో ప్రజాస్వామిక విలువలను కాపాడండి
14. హిందూ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుదాం
15. సంఘ్ పరివార్‌పై అవగాహన లోపం ఎవరికీ లేదు
16. 'కమల' వికాసంలో ఎవరి చేయి ఎంత?
17. క్రైస్తవం పైన దాడులను వ్యతిరేకిద్దాం
18. జాతి ఆకాంక్ష కాదు మానవతకు అవమానం
19. అయోధ్యలో ఏ కరసేవా జరగనక్కరలేదు..జరగనివ్వొద్దు
20. సంఘ్ పరివార్‌ను గట్టిగా ఎదుర్కోవడం అవసరం
21. హిందూత్వవాదుల ద్వేషం ఎవరి మీద?
22. ఇంకెక్కడా మరొక గుజరాత్ కాకుండా చూడటం ప్రజాతంత్ర ఉద్యమాల కర్తవ్యం
23. గుజరాత్‌లో అన్ని కేసులూ బెస్ట్ బేకరీ కేసులే కాబోతాయా?
24. దేశాన్ని 'వెలిగించ'డానికి తగలబెట్టడమూ ఒక మార్గమే
25. భాజపా 'విజన్' - మతోన్మాద ఫాసిజానికి ముసుగు
26. ఎవరికి సంకేతాలు పంపడానికి అఫ్జల్‌ను ఉరితీయాలి?
27. సంఘ్ పరివార్ హింసాకాండను వ్యతిరేకిద్దాం రండి
28. ఆదివాసీ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలను తిరస్కరిద్దాం.
ఇంగ్లీషు నుంచి అనువాదం:
29. మీరట్ 1987 రాజ్య ప్రేరేపిత ఉగ్రవాదంగా మారిన మతకల్లోలం
30. డిసెంబర్ 6, 1992 ఎందుకు జరిగింది?
31. గుజరాత్ ప్రదేశ్: హిందూ రాష్ట్ర ప్రతిరూపం
తొలి ముద్రణ: అక్టోబర్ 2010
పేజీలు: 317
ధర: రూ.150/-
ప్రతులకు, వివరాలకు
హైదరాబాద్ బుక్ ట్రస్ట్
ప్లాట్ నెం.85, బాలజీ నగర్, గుడిమల్కాపూర్,
హైదరాబాద్-500067
ఫోన్: 040 2352 1849